లేటెస్ట్ గా కోలీవుడ్ సినిమా వర్గాల్లో సెన్సేషనల్ గా మారుతున్న వార్త ఏదన్నా ఉంది అంటే అది స్టార్ హీరో విజయ్ జోసెఫ్ రాజకీయ రంగ ప్రవేశం కోసం అని చెప్పాలి. తాను ఇలా ఇప్పుడు చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “లియో” షూటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ పాలిటిక్స్ కోసం మాట్లాడ్డం వైరల్ గా మారింది.
మరి ఈ తర్వాత విజయ్ తన కెరీర్ 68వ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత అయితే విజయ్ కంప్లీట్ గా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే విజయ్ ఇపుడు మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
అయితే విజయ్ ఇపుడు నటించిన లియో రిలీజ్ కి ముందు తమిళనాడులో ఓ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా విజయ్ అయితే ఈ పాదయాత్రను లియో ప్రమోషన్స్ సహా తన పొలిటికల్ జర్నీ కూడా కలిపి యూజ్ అవుతుంది అని తెలుస్తుంది. దీనితో విజయ్ ఈ స్ట్రాటజి చేస్తున్నట్టుగా కోలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు.
ఇక ఈ యాత్ర అనంతరం తన 68వ సినిమాని స్టార్ట్ చేసి దానిని కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేస్తారని అంటున్నారు. దీనితో విజయ్ ప్రస్తుతానికి ఇలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ముందే ఇలాంటి ప్లాన్ చేసి పొలిటికల్ గా బలపడే ప్రయత్నం చేస్తున్న విజయ్ సక్సెస్ అవుతాడో లేదో అనేది చూడాలి మరి.