ఇండస్ట్రీ టాక్ : “NTR30” నుంచి బయటకి వచ్చేసిన స్టార్ నటుడు.?

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర స్టార్ట్ అయ్యిన మాసివ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా అని చెప్పాలి. అంతే కాకుండా ఈ సాలిడ్ సినిమా భారీ బడ్జెట్ తో వాటర్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా అయితే తెరకెక్కుతుంది.

కాగా కొన్ని రోజులు కితమే ఎన్టీఆర్ కూడా సినిమా షూట్ లో పాల్గొనగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ అవైటెడ్ సినిమాలో మరింత మంది స్టార్ లు కనిపించనున్నారని తెలిసిందే.

అలాగే ఈ సినిమాలో మొదట లాక్ అయ్యిన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అయితే ఈ సినిమా నుంచి బయటకి వచ్చేసినట్టుగా పలు రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. తాను ఈ సినిమా ఆఫర్ నచ్చక వదిలేసాడని పలు రూమర్స్ ఇప్పుడు రాగా అసలు దీనిపై అసలు విషయం ఏమిటో స్ట్రాంగ్ ఇన్ఫో తెలుస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ సినిమాలో సైఫ్ లేడు అనే వార్త పచ్చి అబద్దం అట. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఉన్నాడని తన డేట్స్ కూడా ఈ సినిమాకి ఇచ్చాడని తన ఎంట్రీకి సంబంధించి కూడా మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ని అందించనున్నారని లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. ఇది వచ్చే నెలలో రావచ్చని కూడా మరో టాక్ ఉంది.