ఇండస్ట్రీ టాక్ : “RC15″లో బిగ్ హైలైట్ గా ఈ సాంగ్.!

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కోసం అందరికి తెలిసిందే. మరి ఈ సినిమాని అయితే దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా అనేక అంచనాలు దీనిపై ఉన్నాయి.

ఇక శంకర్ సినిమాలు అంటే కంటెంట్ తో సంబంధం లేకుండా పాటలు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఇపుడు చరణ్ సినిమాపై కూడా ఇదే రీతిలో హైప్ తో పాటలు సిద్ధం చేస్తున్నారు. మరి వీటిలో అయితే ప్రతిదీ కూడా మంచి హైలైట్ కాగా శంకర్ పిక్చరైజ్ చేసిన ఓ స్పెషల్ సాంగ్ అయితే సినిమాలో పెద్ద హైలైట్ అవుతుందని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి సమాచారం.

మరి ఈ సినిమాలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇందులో అయితే చరణ్ మరియు అంజలి లపై ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఐటీ ఉందట. ఇది సినిమాలో మంచి హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

అలాగే ఇప్పుడు న్యూజిలాండ్ లో తీస్తున్న సాంగ్ కూడా భారీ లెవెల్లో ఉంటుందని కూడా అంటున్నారు. ఇంకా ఈ సినిమాకి అయ్యితే థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.