ఇంట్రెస్టింగ్ – పవన్ రీఎంట్రీ తర్వాత కంటిన్యూగా అతనొక్కడే.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఓ పక్క పాలిటిక్స్ మరోపక్క భారీ సినిమాలు తో బిజీగా ఉన్న పవన్ ఇన్ని నెంబర్ ఆఫ్ సినిమాలతో ఎప్పుడు కూడా ఇంత బిజీగా లేదు. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న ఆల్ మోస్ట్ అన్ని సినిమాలకి వరుసగా ఓ ఇంట్రెస్టింగ్ అంశం కలవడం విశేషంగా ఒకింత ఆశ్చర్యంగా కూడా మారింది.

పవన్ “అజ్ఞ్యాతవాసి” తర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ తర్వాత వచ్చిన సినిమా “వకీల్ సాబ్”. అయితే ఈ సినిమాతో పవన్ కి వర్క్ స్టార్ చేసిన సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు పవన్ సినిమాలకి వరసగా ఆఫర్స్ ఒకొక్కటి అందుకుంటూ రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వకీల్ సాబ్ తర్వాత వెంటనే భీమ్లా నాయక్ కి చేసాడు.

ఈ తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చిత్రానికి కూడా అతన్నే తీసుకున్నారు. ఇక దీని తర్వాత లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ తో సినిమాకి కూడా ఇతడే వర్క్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో బహుశా పవన్ తో ఎక్కువ సినిమాలు వర్క్ చేసిన మరో సంగీత దర్శకునిగా అప్పుడు రమణగోగుల, మణిశర్మ అలాగే దేవిశ్రీ ప్రసాద్ తర్వాత థమన్ అవకాశం దక్కించుకున్నాడని చెప్పాలి.

అయితే థమన్ ఇంత వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడం అంటే కాస్త ఆశ్చర్యమే అని చెప్పాలి. అయినా పవన్ కి మాత్రం ప్రతీ సినిమా ఆల్బమ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని థమన్ నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఆనందంగానే ఉన్నారు. అంతే కాకుండా ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్ సినిమాకి కూడా తమ మ్యూజిక్ ఇరగ్గుట్టేసాడని రూమర్స్ ఉన్నాయి.