పవన్ కి ఏదో బర్త్ డే విషెస్ లా చెప్తున్నారే.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆ క్రేజ్ తోనే ఇన్నేళ్ల కి కూడా భారీ స్టార్డం తో సినిమాల్లో బిగ్ స్టార్ గా నిలిచాడు. అయితే సినిమాల్లోనే కాకుండా పవన్ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఉన్నారు.

కాగా ఇటీవలె పవన్ తన 27 ఏళ్ల సినీ ప్రయాణాన్ని అలాగే రాజకీయాల్లో నేటితో 10ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. మరి ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ ఎపుడు లేనిది తన కోసం తానే డబ్బా కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది గత కొన్ని రోజులు నుంచి ఏదో చిన్న పిల్లాడికి బర్త్ డే విషెస్ చెప్తున్నట్టుగా పవన్ తో ఇన్నేళ్ల లో వర్క్ చేసిన దర్శకులు, ఆర్ట్ టెక్నీషియన్ లు ఒకొక్కరిగా తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు.

అంతే కాకుండా ఇదంతా పవన్ జనసేన సోషల్ మీడియా నుంచే ప్రచారం చేసుకుంటూ ఉండడం గమనార్హం. దీనితో ఇది మాత్రం పవన్ నుంచి ఊహించని ప్రచారంగా మారింది. కాగా ఇప్పుడు అయితే పవన్ ఓ రీమేక్ సినిమా అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి అలాగే హరిహర వీరమల్లు అనే భారీ సినిమాలు తాను చేస్తున్నారు. అలాగే నేడు పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కోసం అనేకమంది ఎదురు చూస్తున్నారు.ఈ భారీ ప్రోగ్రాం తర్వాత పవన్ సినిమాల షూటింగ్స్ పై మరింత క్లారిటీ రానున్నాయి.