ఇండస్ట్రీ టాక్ : రామ్ చరణ్ తో తమిళ్ భారీ సంస్థ మంతనాలు?

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మంచి క్రేజ్ అండ్ డిమాండ్ ఉన్న హీరోస్ లో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి తాను నటించిన గత చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలన విజయాన్ని నమోదు చేయగా ఈ చిత్రం అనంతరం అయితే దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు.

కాగా ఈ సినిమా తర్వాత మరింతమంది స్టార్ దర్శకులతో సినిమా తాను చేయనున్నాడు కానీ లేటెస్ట్ గా అయితే ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. తమిళ నాట ప్రొడక్షన్స్ లో స్టార్ట్ అయ్యిన అనతి కాలంలోనే భారీ హిట్స్ కొట్టిన భారీ నిర్మాణ సంస్థ ఒకటి అయితే రామ్ చరణ్ తో ఇపుడు మంతనాలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ ప్రొడక్షన్ హౌస్ ఏదో కూడా కాదు. మాస్టర్ చిత్రంతో తమిళ్ లో భారీ హిట్ అందుకొని ఇపుడు “లియో” సినిమాతో రాబోతున్న సంస్థ 7 స్క్రీన్ స్టూడియోస్ అట. కాగా వీరు ప్రస్తుతం చరణ్ తో టచ్ ఉన్నారని అంతే కాకుండా ఓ సినిమా కోసం భారీ మొత్తంలో చరణ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో తమిళ్ నుంచి చరణ్ డైరెక్ట్ సినిమా గాని చేస్తున్నారా అనే అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆల్రెడీ లియో చిత్రంలో కూడా ఉన్నాడు అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి కానీ ఇవైతే నిజం కాదనే సమాచారం.