Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా షూటింగ్ దాదాపుగా 145 రోజులు జరిగిందని ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ అన్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా వింటేజ్ ఫిల్మ్ అని, అంతే కాకుండా ఈ సినిమాలో ప్రతీదీ తయారు చేయాల్సిందేనని, కాబట్టి దాని తయారీకి చాలా సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో 10 రోజులు తయారీకి వెచ్చిస్తే, ఒక రోజు షూట్ చేయాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఈ సినిమాకు చాలా సమయం పడుతుందని ముందే ఊహించామని ఆయన చెప్పారు.
ఇంకో విషయమేమిటంటే సాహో సినిమాకు సమానంగా ఈ మూవీ షూటింగ్ కూడా సమానంగా జరుగుతుందని రాధాకృష్ణ తెలిపారు. సాహో సినిమా కొంచెం ముందే ప్రారంభమైంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చామని, అది చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ సినిమా షూటింగ్ చేశామని ఆయన చెప్పారు. షూటింగ్ చేసిన రోజులు తక్కువే గానీ, ప్రాసెసింగ్‌కే చాలా సమయం పట్టిందని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే తనకు ఇటలీలో ఉన్నపుడు కరోనా వచ్చిందన్న ఆయన, అదే సమయంలో ఆ దేశానికి సంబంధించిన ఏవో తగాదాలు జరుగుతున్నాయని, ఆ మధ్యలో తాము కూడా ఉన్నామని ఆయన చెప్పారు. ఇక ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నారని, అందుకే తామంతా సేఫ్‌గా రాగలిగామని ఆయన చెప్పారు. తాము జార్జియాలో షూట్ చేస్తున్నపుడు, అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్న సమయంలో అక్కడినుంచి టర్కీకి వెళ్లి, మళ్లీ అక్కడినుంచి ఇటలీకి అలా దాదాపు 3 రోజులు పడుకోకుండా అందర్నీ చాలా జాగ్రత్తగా ఇండియా తీసుకొచ్చారని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఫ్లైట్స్ కాన్సిల్ కావడంతో జార్జియా నుంచి ఇటలీ వెళ్లి, అక్కడ షూట్ చేయాల్సింది కానీ ఇండియా వచ్చిందని, ఆ తర్వాత తనకు, తన కెమెరామెన్‌కు, మరికొందరికి కరోనా సోకడంతో హోటల‌్లోనే ఉండాల్సి వచ్చిందని, అందరికీ తగ్గాక మళ్లీ షూట్ పెట్టామని, అందుకే రిలీజ్‌కు చాలా సమయం పట్టిందని ఆయన వివరించారు.