రాజ్ తో రిలేషన్ షిప్ పై స్పందించిన సమంత.. షాకింగ్ పోస్ట్ తో కౌంటర్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తెరపై కనిపించకపోయినా.. ఆమె చుట్టూ జరుగుతున్న ప్రచారం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధిని జయించిన తర్వాత సినిమాలకు విరామం తీసుకున్న సామ్, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ట్రాలాలా బ్యానర్‌పై ‘శుభం’ అనే సినిమాను విడుదల చేసింది. ఈ మూవీ మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం సంబంధించిన వార్తలు చర్చకు దారితీస్తున్నాయి.

బాలీవుడ్ ప్రాజెక్ట్‌ ‘సీటాడెల్: హనీ బన్నీ’లో పనిచేసిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా కనిపిస్తున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉందంటూ పుకార్లు ఊపందుకున్నాయి. వీరి మధ్య ప్రేమ ఉంది, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న రూమర్స్‌కు ఈ ఫొటోలు బలమిచ్చాయి.

ఇంతకీ విషయం ఇక్కడితో ఆగలేదు. రాజ్ నిడిమోరు భార్య కొన్ని పోస్టులు షేర్ చేయడంతో ఈ వ్యవహారం మరింత వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ‘‘ఒకవేళ ఆయనకు భార్య, పిల్లలు ఉన్నప్పుడు ఇలా రెలేషన్‌లో ఉండటమేంటి?’’ అంటూ నెటిజన్లు సమంతపై ప్రశ్నలు గుప్పించారు.

ఈ ట్రోలింగ్ మధ్య సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ కొటేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. “ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే, వారిని కలిసే చెబుతాను. మనం మనుషులం. ఎంతకాలం ఎవరు ఉంటారో తెలియదు. అందుకే మన అనుభూతులను వారికి వెంటనే వ్యక్తం చేయాలి,” అనే భావాన్ని పేర్కొన్న ఈ కొటేషన్‌ను కొందరు నెటిజన్లు రాజ్ భార్యకు సమంత ఇచ్చిన సమాధానంగా చూస్తున్నారు. అలాగే, ఆమె రాజ్‌ను పర్సనల్‌గా ఎంతో ఇష్టపడుతుందన్న సందేశాన్ని పరోక్షంగా ఇస్తోందని పలువురు చెబుతున్నారు.

ఇక ఈ వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు సమంతను సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి, సమంత-రాజ్ మధ్య నిజంగా ఏముందన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ గాసిప్స్, స్పందనలు మాత్రం ఆమెను మరోసారి వార్తల కేంద్రబిందువుగా నిలిపేశాయి.