వైరల్ – తన డ్రీం రోల్ రివీల్ చేసిన సీతా మహాలక్ష్మి.!

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి సీతా మహాలక్ష్మి అనే పేరు పెద్దగా పరిచయం చెయ్యక్కర్లేదు. సీతా రామం అనే సినిమాతో పరిచయం అయ్యిన మృణాల్ ఠాకూర్ అమితంగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ తెలుగులో అపారమైన ఆదరణను అందుకుంది.

ఇక ఇప్పుడు తెలుగులో తన రెండో సినిమాగా నాచురల్ స్టార్ నాని తో ఓ ఇంట్రెస్టింగ్ సినిమాని ఆమె ఓకే చేసింది. ఇలా తెలుగు సహా హిందీలో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీత లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వేదిక గా అయితే ఓ చాట్ సెషన్ ని పెట్టగా అందులో ఆమెకి తన కెరీర్ లో ఏదన్నా డ్రీం రోల్ చేయాలి అని ఉందా అనే ప్రశ్నకి అయితే ఆమె సమాధానం ఇచ్చింది.

ఆమె డ్రీం రోల్ గా అయితే హాలీవుడ్ సెన్సషనల్ ఫ్రాంచైజ్ అయినటువంటి మార్వెల్ లో ఏ సూపర్ హీరో రోల్ అయినా కూడా చెయ్యాలి అనేది తన డ్రీం రోల్ అని తాను తెలిపింది. దీనితో ఈమె డ్రీం రోల్ ఏంటి అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా మృణాల్ హిందీలో జెర్సీ రీమేక్ లో నటించగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో చేసిన అవైటెడ్ సినిమా సెల్ఫీ సినిమా రిలీజ్ తో ఆమె సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఈ ఫిబ్రవరి 24న రిలీజ్ కానుండగా ఈ సినిమా మలయాళ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్ గా తెరకెక్కించారు.