నాని “హాయ్ నాన్న” టోటల్ టార్గెట్ ఎంతంటే..!

ఈ డిసెంబర్ నెలలో టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు చిత్రాల్లో ప్రామిసింగ్ హైప్ తెచ్చుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “హాయ్ నాన్న” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. 

ఈ చిత్రం నాచురల్ స్టార్ కానీ కెరీర్ లో 30వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా యువ దర్శకుడు శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం నాని కెరీర్ లో మరో ఎమోషనల్ సినిమాగా తెరకెక్కగా ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి.

కాగా ఈ చిత్రం నాని గత బిగ్గెస్ట్ హిట్ “దసరా” తర్వాత రిలీజ్ కి వస్తుంది. అయితే హాయ్ నాన్న వరల్డ్ వైడ్ గా మాత్రం మంచి బిజినెస్ నే లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దసరా సినిమా మాస్ కాబట్టి ఆ హైప్ 50 కోట్ల మేర బిజినెస్ చేసింది. కానీ ఇది దానికి కంప్లీట్ క్లాస్ అయినప్పటికీ 30 కోట్ల మేర బిజినెస్ ని చేసినట్టుగా సినీ వర్గాల్లో సమాచారం.

దీనితో పాటుగా నాని గత డిజాస్టర్ సినిమా అంటే సుందరానికి సినిమాకి కూడా 29 కోట్ల మేర జరిగింది. మరి నాని క్లాస్ సినిమాలకి అంత మార్కెట్ లేకపోయినా కూడా హాయ్ నాన్న కి ఈ రేంజ్ బిజినెస్ జరగడం విశేషం. మరి ఇంత రాబట్టాలి అంటే హాయ్ నాన్ని 60 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోవాలి. మరి ఈ డిసెంబర్ లో ఏమవుతుందో చూడాలి.