గాసిప్స్ : బన్నీ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో ఈ హీరోయిన్.?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హైలైట్ గా వినిపిస్తూ వైరల్ అవుతున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మాసివ్ పాన్ ఇండియా సినిమా “పుష్ప 2 ది రూల్” కోసం భారీ లెవెల్లో చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అయితే అల్లు అర్జున్ సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో అయితే చేయనున్నాడు.

అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో 23వ సినిమాగా చేయనుండగా ఈ సినిమా తోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు అయితే ఈ సినిమాని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా కొన్ని వారాల కితం అయితే అనౌన్స్ చేశారు.

మరి ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ ని అప్పుడే మేకర్స్ అయితే లాక్ చేసేసారట. మరి ఈ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ ని కొట్టేసింది ఎవరో కూడా కాదట సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ అన్నట్టు తెలుస్తుంది.

అయితే మృణాల్ అటు నార్త్ లోని ఇటు తెలుగు సినిమాలో కూడా బాగా పరిచయం అలాంటప్పుడు ఈ తరహా సినిమాకి ఆమె బెస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో సందేహమే లేదు. మరి దీనిపై ఏమన్నా అధికారిక అప్డేట్ వస్తుందేమో చూడాలి.