ఇండస్ట్రీ టాక్ : NTR30 లో హీరోయిన్, విలన్ వాళ్ళే.!

గత కొన్ని నెలలు నుంచి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా కోసమే సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో చర్చగా నడుస్తుంది. మరి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది మంచి సస్పెన్స్ గా మారగా అంతకన్నా సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఆసక్తిగా మారింది.

మరి ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది పేర్లు మారి ఫైనల్ గా బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కి వచ్చింది. మరి ఈమెపై ఆల్రెడీ ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నే ఫైనల్ అయ్యిందట.

అంతే కాకుండా దీనితోనే జాన్వీ టాలీవుడ్ డెబ్యూ ఫిక్స్ అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇక మరో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో విలన్ గా తమిళ్ నుంచి స్టార్ హీరో విక్రమ్ అలాగే బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ ల పేర్లు వచ్చిన సంగతి తెలిసిందే. మరి వారిలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఎన్టీఆర్ సినిమాలో ఫిక్స్ అయ్యినట్టుగా గట్టి ఇన్ఫో వినిపిస్తుంది.

దీనితో ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ విలన్ గా సైఫ్ లు ఖరారు అయ్యారు. కాగా సైఫ్ ఆల్రెడీ ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ లో కూడా విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో తాను ఎలా ఉంటాడో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు.