ఈ ఒక్క విషయంలో “దేవర” ని బాగా లేపుతున్నారుగా..!

ఈ ఏడాది మాత్రం టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో గత ఏడాదికి మించి చాలానే రాబోతున్నాయి. మరి ఈ చిత్రాల్లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివల  కాంబినేషన్ లో ప్లాన్ చేసిన రెండో సినిమా అలాగే ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమా “దేవర” కూడా ఒకటి.

కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయే స్టేజికి వచ్చేసింది. కాగా ఈ ఈ సినిమా విషయంలో మాత్రం కొరటాల చాలా పక్కాగా ప్లానింగ్ గా ఉన్నాడని ఎట్టి పరిస్థితుల్లో ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఆ తరహా సినిమా కాకుండా కంప్లీట్ వేరే సినిమా అందిస్తాడు అని మొదటి నుంచి టాక్ ఉంది.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు నుంచి అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్క అంశం మాత్రం బాగా వినిపిస్తుంది. దీనితో దేవర సినిమాలో విజువల్స్ గాని గ్రాఫిక్స్ గాని నెవర్ బిఫోర్ లెవెల్లో ఉంటాయని చాలా గ్రాండ్ ట్రీట్ ని దేవర అందిస్తుంది అని ఎన్టీఆర్ పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఒక్క విషయాన్ని మాత్రం చాలా బాగా లేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు ఎన్టీఆర్ మీద వచ్చిన ఏ పోస్టర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ఏమి రాలేదు. మరి సినిమాలో కొరటాల ఎలాంటి విజువల్స్ ని చూపిస్తారో చూడాల్సిందే.. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.