ఇండస్ట్రీ టాక్ : “బాలయ్య 108” కి అప్పుడే ఇది ఫిక్స్.!

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘వీరసింహ రెడ్డి’ అనే సినిమా చేస్తున్నాడు. మరి చాలా కాలం తర్వాత బాలయ్య నుంచి ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తుండగా అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి.

దీనితో ఈ అవైటెడ్ సినిమా రిలీజ్ అత్యంత ఆసక్తిగా మారింది. ఇక దీనికి ముందు కూడా తాను అఖండ అనే సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకోగా బాలయ్య అయితే ఇప్పుడు వీరసింహా రెడ్డి తో అది కంటిన్యూ చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది.

ఇంకా దీని తర్వాత కూడా దర్శకుడు అనీల్ రావిపూడిని లైన్ లో పెట్టడం ఆసక్తిగా మారగా ఇప్పుడు దీనిపై మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంకా జవాల్కర్ ఫిక్స్ అయ్యినట్టుగా బజ్ రాగ ఇప్పుడు అయితే ఈ సినిమాకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి దీనితో అయితే ఈ డిసెంబర్ 8న ముహూర్తం సెట్ అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం టైటిల్ కూడా రోజున వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అంటున్నారు.