Health Tips: బలహీనంగా ఉన్నవారికి ఈ ఆయుర్వేద మందులు మంచి ఔషధంల పనిచేస్తాయి..!

Health Tips: ఒక మనిషి ఆరోగ్యం వారు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వచ్చి ఫాస్ట్గా ఆహారం తీసుకుంటే సరిపోతుంది. కానీ మనిషి బలహీనంగా తయారవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. పౌష్టికాహార లోపం, శరీరానికి ఆక్సిజన్ సరిగా అందకపోవడం, శరీరంలో రక్త శాతం తక్కువగా ఉండటం వంటివి అనేక కారణాలు. శరీరానికి తగిన మోతాదులో ఆక్సిజన్ అందకపోవడం వల్ల శరీరం బలహీనంగా తయారయి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

బలహీనత వల్ల తలెత్తే సమస్యలకు కొన్ని ఆయుర్వేద మందులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఆక్సిజన్ కొరత వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలను అదుపు చేయడానికి ఉపయోగించే కొన్ని ఆయుర్వేద మందుల గురించి తెలుసుకుందాం.

* శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, దగ్గు, కఫం వంటి వ్యాధులను నియంత్రించడానికి లైకో రైస్ పొడి బాగా పనిచేస్తుంది. ఈ పొడిని రోజు భోజనం చేసిన తర్వాత కొంచం తేనెతో కలిపి తీసుకోవటం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

* ఉసిరిి పొడిని ముందు రోజు రాత్రి గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే కాలి కడుపుతో ఆ నీటిని తాగటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు అరికట్టవచ్చు.

* ద్రాక్షారిష్ట అను ఒక ఆయుర్వేదిక్ టానిక్ వల్ల శరీర బలహీనతను దూరం చేయటమే కాకుండా శ్వాస కోస వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ టానిక్ వల్ల శరీరంలో రక్తశాతం పెరిగి రక్త హీనత సమస్య తగ్గిస్తుంది. ఆయుర్వేదిక మందులు వాడటానికి ముందు ఆయుర్వేద పండితుల సలహా తీసుకోవటం మంచిది.