సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణులు వీళ్లే!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటూ వివిధ సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్రతారాలుగా కొనసాగుతూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.మరి ఏ హీరోయిన్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే ….

నయనతార: లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఒక్కో సినిమాకు రెండు నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈమె సినీ కెరియర్ లో ఇప్పటివరకు 75 సినిమాలలో నటించారు.

అనుష్క శెట్టి:తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఒక్కో సినిమాకి 6 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

సమంత: దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె కూడా ఒక్కో సినిమాకు ఆరు నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

పూజా హెగ్డే:కెరియర్ మొదట్లో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి పూజా హెగ్డే ప్రస్తుతం అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్నారు. ఇక ఈమె కూడా ఒక్కో సినిమాకు మూడు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

రష్మిక: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నటువంటి రష్మిక ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

తమన్నా: తెలుగు తమిళ భాషలలో సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న తమన్నా ఒక్కో సినిమాకి రెండు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

కాజల్ అగర్వాల్: వెండితెర చందమామగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఒక్కో సినిమాకి రెండు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. రకుల్ ప్రీత్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు ఇక ఈమె కూడా ఒక్కో సినిమాకు ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

కీర్తి:తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంటూ మరోవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి కీర్తి సురేష్ మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

శ్రీనిధి శెట్టి:కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నటువంటి శ్రీనిధి శెట్టి మూడు నుంచి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.