రాజమౌళి హత్యకు కుట్ర జరుగుతుంది… రాజమౌళిని హెచ్చరించిన వర్మ!

దర్శక ధీరుడు ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన పట్ల ఎంతోమంది హాలీవుడ్ దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక అవతార్ వంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమారూన్ సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రాజమౌళి జేమ్స్ ముచ్చటించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వీరిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా రాజమౌళిఎదుగుదల చూసిన కొందరు ఇండియన్ ఫిలిం డైరెక్టర్లు తనపై ఈర్ష్య పడుతున్నారు. ఈ క్రమంలోనే తనపై కుట్ర చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారని ఇలా తనపై హత్యకు ప్లాన్ చేసిన వారిలో తాను కూడా ఉన్నానంటూ రాంగోపాల్ వర్మ తెలియజేశారు.

నాకు నాలుగు పెగ్గులు ఎక్కువ అయ్యి ఇలా నిజం బయట పెడుతున్నాను. మిమ్మల్ని హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే మీరు మరింత భద్రత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రాజమౌళి ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు.ఇలా రాజమౌళి పై హత్యకు ప్లాన్ జరుగుతుందంటూ రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం ఉండదని ఇదంతా కూడా రాంగోపాల్ వర్మ ప్లాన్ అంటూ కొట్టి పారేస్తున్నారు.