అడివి శేష్ మరోసారి భారీ హైప్‌తో మరో సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న అతని కొత్త సినిమా ‘డెకాయిట్’ ఫస్ట్ గ్లింప్స్ మే 26న విడుదల కానుండగా.. ముందుగానే ఈ చిత్రం సంచలనంగా మారింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌తోనే ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శనీల్ దియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోనీ మ్యూజిక్ సంస్థ తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రానికి ఏకంగా రూ.8 కోట్లు చెల్లించి మ్యూజిక్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఇదే అడివి శేష్ కెరీర్‌లోనే అతిపెద్ద మ్యూజిక్ డీల్. శేష్ హిందీలోనూ క్రేజ్ సంపాదించడంతో, సోనీ మ్యూజిక్ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. భీమ్స్ సినిమాకి సంగీతం అందిస్తుండగా, మాస్ + మెలొడీ బేస్‌డ్ ట్యూన్స్‌తో ఆల్బమ్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం డెకాయిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో స్పెషల్ ఎలిమెంట్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. 2025 మొదటి భాగంలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కథ, ప్రెజెంటేషన్, స్టార్ కాస్ట్ అన్నింటికీ భిన్నంగా ఉండే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ గ్లింప్స్‌తో మరో స్థాయికి వెళ్తుందా? అనే కుతూహలం ఇప్పుడే మొదలైంది.