సూపర్ బంపర్ న్యూస్ థియేటర్స్ ఓపెన్ అయ్యేది ఆ రోజే..!

కరోనా వల్ల దేశంలో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ అన్ లాక్ వల్ల మెల్లమెల్లగా దాదాపు అన్ని పరిశ్రమలు తెరుచుకున్నాయి. కానీ ఇంకా దేశంలో థియేటర్స్ మాత్రం తెరుచుకోవడం లేదు. అన్ లాక్ 3.0లో జిమ్స్, వైన్ షాప్స్ కు అనుమతి ఇచ్చారు. కానీ థియేటర్స్ కు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం మూవీ షూటింగ్స్ కు అనుమతి ఇస్తూ, షూటింగ్ సమయంలో పాటించవలసిన జాగ్రత్తలపై ఆదేశాలు కూడా జారీ చేసింది.

Theaters to be opened soon, confirms central govt
Theaters to be opened soon, confirms central govt

ఇప్పటికే చాలావరకు దేశంలో మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. కానీ థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారని సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 5నెలలుగా థియేటర్స్ మూత పడటం వల్ల వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే థియేటర్లు ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పనుంది.

సెప్టెంబర్ మధ్యలో థియేటర్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సిద్ధమవుతుందని సమాచారం. థియేటర్లు ఎలా నిర్వహించాలో యాజమాన్యాలకు సంకేతాలు ఇస్తూ పై మార్గదర్శకాలు ఇచ్చారు మరిన్ని సూచనలతో వారికి ముందే ఒక నోట్ వెళ్లబోతోంది. అంతా ఓకే అనుకున్నాక థియేటర్లను ఓపెన్ చేస్తారని అంటున్నారు. ఈ దిశగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇప్పటికే థియేటర్లను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. సెప్టెంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు తెరుచుకుంటాయని.. దసరాకు కొత్త సినిమాల సందడి చూడొచ్చని కాకపోతే అనేక షరతుల మధ్య సినిమాల ప్రదర్శన సాగుతుందని.. పూర్తి ఆక్యుపెన్సీ మాత్రం వ్యాక్సిన్ రాకుండా సాధ్యం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. థియేటర్స్ మూతపడటం వల్ల ఇప్పటికే చాలా మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లలో రిలీజ్ అయ్యాయి. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్ లాంటి మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. నాని నటించిన ‘V’ మూవీ కూడా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.