రౌడీ హీరోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న యువతి.. రింగు తొడిగి ప్రపోజ్ చేసిన యువతి?

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇలా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఈనెల 25వ తేదీ లైగర్ అనే పాన్ ఇండియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఇప్పటికే నార్త్ ఇండస్ట్రీలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ అలాగే చిత్ర బృందం బెంగళూరులో సందడి చేయగా అక్కడ విజయ్ దేవరకొండను చూసిన ఓ యువతి బోరున కన్నీళ్లు పెట్టుకుంది.ఇలా ఆమె విజయ్ దేవరకొండను చూసేసరికి ఎమోషనల్ అవ్వడమే కాకుండా మోకాళ్ళపై కూర్చొని ఏకంగా తన చేతి వేలికి ఉన్న ఉంగరం తీసి విజయ్ దేవరకొండకు పెట్టి ప్రపోజ్ చేసింది.ఈ క్రమంలోనే ఈ వీడియోని ఆ యువతి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా ఈ వీడియోని షేర్ చేసిన యువతి ఈరోజున తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండను కలిశానని అలాగే తనకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశానని చెప్పుకొచ్చారు.ఇలా తనతో రింగ్ తొడిగించుకున్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి అయ్యేవరకు తాను ఆ ఉంగరం తీయని మాట ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆ యువతి విజయ్ దేవరకొండ గురించి చెప్పడమే కాకుండా ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు అసలు విజయ్ దేవరకొండకు మామూలు క్రేజ్ లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.