హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థి… సస్పెన్షన్ వేటు వేసిన కాలేజ్ యాజమాన్యం!

అపర్ణ బాలమురళి పరిచయం అవసరం లేని పేరు ఆకాశమే నీ హద్దురా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ తమిళ మలయాళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ రెండు భాషలలో వరుస సినిమాలు చేస్తూ అగ్రతారగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె కేరళలో ఒక లా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. అయితే ఓ విద్యార్థి ఈమె పట్ల అత్యుత్సాహం చూపిస్తూ తన అనుమతి లేకుండా తన చేయి పట్టుకుని తనని లాగడమే కాకుండా తన పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారు.

దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు సెలబ్రిటీలు ఈ వీడియో పై స్పందిస్తూ నటి అపర్ణ బాలమురళికి మద్దతు తెలిపారు. ఇక ఈమె కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఒకలా చదివే విద్యార్థికి ఉండాల్సిన అర్హతలు ఆ వ్యక్తిలో లేవని ఒక మహిళ పర్మిషన్ లేకుండా తన చేయి పట్టుకొని లాగడం కూడా నేరము అనే విషయం ఆ విద్యార్థికి తెలియకపోవడం ఏంటి అని అసహనం వ్యక్తం చేశారు.

ఈ విధంగా విద్యార్థి హీరోయిన్ పట్ల ప్రవర్తించిన తీరు పలువురు సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత చూపించారు. ఈ క్రమంలోనే సదరు కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ నటి అపర్ణ బాలమురళికి క్షమాపణలు చెప్పారు. అనంతరం హీరోయిన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సదరు విద్యార్థిని సస్పెండ్ చేస్తూ కాలేజ్ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది.