ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర అంతా కూడా పాన్ ఇండియా సినిమాల హవాయే నడుస్తుంది. అది ఏ భాష నుంచి అయినా కానీ అన్ని ఇండస్ట్రీల నుంచి వారు పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. తమ కంటెంట్ మీద నమ్మకంతో అనౌన్స్ చేయడం వేరు సొంతంగా హీరోకి పాన్ ఇండియా క్రేజ్ ఉండడం వేరు అని చెప్పాలి.
సొంతంగా మన ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా క్రేజ్ ని ఏర్పర్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. బన్ను ఇన్నాళ్ళుగా చేసిన అన్ని సినిమాలు కూడా తనకి తెలియకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో పాపులర్ అయ్యాయి.
మెయిన్ గా తన డాన్సులు అయితే నార్త్ సౌత్ ఆడియెన్స్ లో దూసుకెళ్లాయి. దీనితో అలా అంచెలంచెలుగా మంచి క్రేజ్ ఉందని తెలుసుకున్న బన్నీ దానిని టెస్ట్ చేసాడు. “పుష్ప” రిలీజ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టిన బన్నీ మొదటి సినిమా తోనే హిందీ మార్కెట్ లో 100 కోట్లు వసూళ్లు రాబట్టాడు.
అయితే హిందీలో బన్నీ క్రేజ్ ఇదే అనుకుంటే పొరపాటే.. ఇండియా క్రికెట్ హిస్టరీ లోనే భారీ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎం ఎస్ ధోని. మరి ఎం ఎస్ ధోని భార్య సాక్షి సింగ్ ధోని కి బన్నీ ఫేవరెట్ హీరో అని ఆమె చెప్పడం అసలు పాన్ ఇండియా సినిమా దగ్గర బన్నీ హవా ఎప్పుడు నుంచి ఉందో అర్ధం చేసుకోవాలి.
ఆమె లేటెస్ట్ గా మాట్లాడుతూ తాను బన్నీ చిత్రాలు చూస్తూ పెరిగాను అని తన డాన్స్ లు తన నటన నాకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ అంటే అల్లు అర్జున్ అని చెప్పడంలో సందేహమే లేదు.