ప్రముఖ తమిళ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఊపిరి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కార్తి విభిన్నమైన సినిమాలలో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల కార్తీ నటించిన సర్దార్ సినిమా తమిళ్ భాష తో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చింది.
తెలుగు, తమిళ్ భాషలలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా నిర్మాతలకు అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో సినిమా బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాత ప్రిన్స్ పిక్చర్ అధినేత ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమా దర్శకుడికి ఒక ఖరీదైన బహుమతిని కానుకగా అందజేశారు. ఈ సినిమా సక్సెస్ అయ్యి భారీ స్థాయిలో లాభాలు రావటంతో ఈ సినిమా నిర్మాత ఎస్. లక్ష్మణ్ హీరో కార్తీ చేతులమీదుగా దర్శకుడికి ఒక ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు ఖరీదు దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువ ఉన్నట్లు తెలుస్తోంది.
సర్దార్ సినిమా విజయం సాధించినందుకు నిర్మాత ఇలా కారుని బహుమతిగా ఇవ్వటంతో దర్శకుడు ఆనందం వ్యక్తం చేస్తూ నిర్మాతకి కృతజ్ఞతలు తెలియజేసాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సర్దార్ సినిమా మంచి హిట్ అవటంతో ఈ సినిమా పార్ట్ 2 కోసం డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సర్దార్ పార్ట్ 1 ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవటంతో పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు దర్శకుడు వెల్లడించాడు.