ఎంత తాగితే అంత మంచిది.. నా కొడుకుకు ఇలా అయ్యిందంటూ యాంకర్ శ్యామల పోస్ట్!

బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ఎంతో బిజీగా ఉన్న శ్యామల పలు సినిమాలలో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సొంతం ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ లైఫ్ లో ఎంతో బిజీగా ఉండి పోయారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్యామల సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం సోషల్ మీడియా వేదికగా డాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి.ఈ క్రమంలోనే రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడం చేత ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈమె తన అభిమానులకు సూచించారు. పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని వీలైనంతవరకు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని శ్యామల తెలియజేశారు. ఎంత వీలైతే అంత ఎక్కువగా కొబ్బరినీళ్లు, ఫ్రూట్ జ్యూస్, వాటర్ తాగుతూ ఉండాలని శ్యామల వెల్లడించారు.

ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తన కొడుకు కేవలం తన ఫ్రెండ్ ఇంటి వరకు వెళ్లి రావడంతో సన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారని, అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉంటూ వీలైనంతవరకు ఎక్కువ పానీయాలు తాగుతూ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అంటూ శ్యామల తెలియచేశారు. శ్యామల యాంకర్ గా బుల్లితెర నటిగా మాత్రమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా హాజరయ్యి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.