బుల్లి మేక వారసుడికి పేరు ఫిక్స్ చేసిన మెగాస్టార్….. మరోసారి రిపీట్ చేసిన సెంటిమెంట్?

మెగా కాంపౌండ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి శుభవార్తను తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవికి మనవడు పుడతారని అందరూ ఆశ బావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టబోయే మెగా వారసుడికి కూడా ఇప్పటికే ఒక పేరును ఫిక్స్ చేసి పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలా మెగా వారసులు పుట్టబోతున్నారని తెలియడంతో ఇప్పటికే తనకు పేరు ఫిక్స్ చేయడంతో ఎలాంటి పేరు అనుకున్నారనే విషయం గురించి ఆత్రుత ఏర్పడింది.అయితే మెగా కుటుంబంలో జన్మించిన వారందరి పేర్ల వెనుక తేజ్ అని ఉండడం మనం గమనించే ఉంటాం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ పేరు చివరన తేజ్ ఉండాలని నిర్ణయించుకున్నారట.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామిని ఎంతో భక్తి భాగంతో పూజిస్తారు.ఇక రాంచరణ్ ఉపాసన విషయాన్ని కూడా సోషల్ మీడియా పేదికగా తెలియజేస్తూ హనుమాన్ జీ ఆశీస్సులతో అంటూ ఈయన ఉపాసన తల్లి కాబోతుందనే విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే తనకు మనవడు పుడితే అంజన్ తేజ్ అనే పేరు పెట్టాలని చిరంజీవి ఫిక్స్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.