సోషల్ మీడియాలో మొదలైన లైగర్ హంగామా… స్పెషల్ ఎమోజి క్రియేట్ చేసిన ట్విట్టర్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హీరో హీరోయిన్ పలు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో కూడా లైగర్ హంగామా మొదలైంది. ఇప్పటికే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా ట్విట్టర్లో ఎమోజిని సాధించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ సాహో సినిమా తర్వాత యష్ కేజిఎఫ్2, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు ఇలా ట్విట్టర్లో ఎమోజీలను సాధించాయి. ప్రస్తుతం లైగర్ సినిమాకి కూడా ట్విట్టర్ ఎమోజిని క్రియేట్ చేశాయి. ఇలా లైగర్ కోసం ట్విట్టర్ ఎమోజి క్రియేట్ చేయడంతో లైగర్ టీం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే వరంగల్ లో ఘనంగా ఫ్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇక ఇందులో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.