The Great Indian Kapil Show: కామెడీ షో.. ఒక్క ఎపిసోడ్ కోసం 5 కోట్లా?

కపిల్ శర్మ తన కామెడీతో ప్రేక్షకులను అలరించడం కొనసాగిస్తూనే, పారితోషికంలో కూడా టాప్‌లో నిలుస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో కపిల్ కుదుర్చుకున్న తాజా ఒప్పందం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ రెండు సీజన్లుగా అద్భుత విజయాలు సాధించిన నేపథ్యంలో మూడో సీజన్‌కు కపిల్ రెడీ అవుతున్నారు. ఈసారి ఆయనకు సీజన్ 3 కోసం రూ. 5 నుంచి 6 కోట్ల మధ్యలో చెల్లిస్తున్నారని సమాచారం.

అంటే 10 ఎపిసోడ్స్ చేసినా కూడా లెక్క 50 కోట్లు మార్క్ ని టచ్ అవుతుంది. ఈ షోకు కపిల్ శర్మ ఏ స్థాయిలో ఫన్ అందిస్తున్నాడో, అందుకు తగిన గుర్తింపు కూడా పొందుతున్నాడు. సాధారణంగా హీరోలు, స్టార్ సెలబ్రిటీలకు మాత్రమే ఇలాంటి భారీ పారితోషికాలు అందుతాయి. కానీ కపిల్ తన కామెడీ టాలెంట్‌తో ఆ రేంజ్‌లోకి వెళ్లడం ప్రత్యేకమే. బాలీవుడ్‌లో హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న ఈ సమయంలో, కపిల్‌కు నెట్‌ఫ్లిక్స్ ఇంత భారీ చెల్లింపు చేయడం మరింత చర్చనీయాంశమవుతోంది.

ఈసారి షోలో సౌత్ ఇండియన్ స్టార్స్ కూడా పాల్గొనబోతున్నారని, కపిల్ మరింత వెరైటీ కామెడీ పంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వివరాలు బయటకు రావడంతో అభిమానులు సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీజన్ 2లో కపిల్ ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపాడో, ఇప్పుడు ఆ స్థాయి దాటి మరింత ఎంటర్టైన్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

కపిల్ శర్మ ప్రస్తుత పారితోషికం కేవలం అతని టాలెంట్‌కే కాకుండా, ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో కామెడీ షోల గుర్తింపుకు మార్గం చూపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న కమెడియన్‌గా కపిల్ నిలుస్తుండటం, ఇతర స్టాండ్‌ప్ కమెడియన్లకు కూడా ప్రేరణగా మారుతోంది.

ఖతర్నాక్ త్రిష || Director Geetha Krishna EXPOSED Trisha Affairs || Prabhas || Pawan, Mahesh || TR