ఉత్కంఠను రేపుతున్న సుల్తాన్‌ అఫ్‌ ఢిల్లీ

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ మిలన్‌ లుథ్రియా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ది డర్టీ పిక్చర్‌, వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి, టాక్సీ నెం. 9211 (2006) వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను బాలీవుడ్‌కు అందించాడు.

ఇక తాజాగా మిలన్‌ లుథ్రియా చేస్తున్న వెబ్‌ సిరీస్‌ సుల్తాన్‌ అఫ్‌ ఢిల్లీ. హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ నుంచి వస్తున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ నటి మౌని రాయ్‌, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌, అంజుమ్‌ శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు టీజర్‌ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సిరీస్‌ నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సిరీస్‌ 1962 ఢిల్లీలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సిరీస్‌ అక్టోబర్‌ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీG హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.