మహేష్ కోసం మొదటిసారి అలాంటి పని చేస్తున్న జక్కన్న.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇలా దర్శకుడిగా రాజమౌళి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని అపజయం ఎరుగని దర్శకుడిగా పేరుపొందారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత జక్కన్నకు దక్కిందని చెప్పాలి.టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా బాక్సాఫీస్ షేక్ చేసిన రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా పనులలో రాజమౌళి ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక రాజమౌళి ఏ సినిమా కైనా తన సినిమా కథ సిద్ధమైన తర్వాత ఆ పాత్రలో ఎవరు కరెక్ట్ గా సరిపోతారు అనే విషయాన్ని గుర్తించి ఆ నటీనటులను ఎంపిక చేస్తారు కానీ మొదటిసారి మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న తన సినిమాలలో ఎప్పుడూ చేయనటువంటి ఒక పనిని చేయబోతున్నారు. మహేష్ బాబుతో పోటీ పడటం కోసం బాలీవుడ్ నటిని విలన్ గా దింపబోతున్నారని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమాలలో ఇప్పటివరకు యుద్ధాన్ని ప్రకటించడం కోసం మహిళలను ఉపయోగించారు, కానీఎప్పుడు తన సినిమాలలో విలన్లుగా మహిళలను చూపించలేదు కానీ మొదటిసారిగా మహేష్ బాబు సినిమా కోసం బాలీవుడ్ నటి మౌని రాయ్ ను విలన్ పాత్రలో దింపబోతున్నారని వార్త పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలి.