సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న మెహ్రీన్‌ పోస్ట్?

నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ సొగసరి మెహ్రీన్‌ ఫిర్జాదా. తొలి సినిమాతోనే యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్‌ ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొడుతూ టాలీవుడ్‌ లక్కీ చార్మ్‌గా పేరు తెచ్చుకుంది.

అయితే ఈ హ్యాట్రిక్‌ బ్లాక్‌ బస్టర్‌ల తర్వాత మెహ్రీన్‌ను వరుస ఫ్లాపులు పలకరించాయి. దాంతో ఆమె క్రేజ్‌ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మెహ్రీన్‌ చేసిన ఓ ట్వీట్‌ నెట్టింట దుమారం రేపుతుంది. రీసెంట్‌గా ఈ పంజాబీ సొగసరి నటించిన సుల్తాన్‌ ఆఫ్‌ ఢల్లీ అనే వెబ్‌ సిరీస్‌ హాట్‌స్టార్‌లో రిలీజ్కెంది. ఎప్పుడూ పద్దతిగా కనిపించే ఈ బ్యూటీ ఈ వెబ్‌ సిరీస్‌లో కొన్ని హాట్‌ సీన్‌లు చేసింది.

ఇప్పటివరకు అలాంటి సీన్లు చేయని మెహ్రీన్‌.. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం గోడలు బద్దలు కొట్టింది. రెచ్చిపోయి ముద్దు సీన్లలో నటించింది. అయితే మెహ్రీన్‌ ఇలాంటి సీన్‌లలో నటించడం చూసి కొంత మంది ఫ్యాన్స్‌ నిరాశ పడ్డారు. దాంతో కొంతమంది బోల్డ్‌ సీన్స్‌లో నటించినందుకు మెహ్రీన్‌పై విమర్శలు చేస్తున్నారు.

ఇక మెహ్రీన్‌ అలా విమర్శలు చేస్తున్న వారికి తన స్టైల్‌లో కౌంటర్‌ ఇచ్చింది. రీసెంట్‌గా నేను ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూ సుల్తాన్‌ ఆఫ్‌ ఢల్లీ అనే వెబ్‌ సిరీస్‌ చేశాను. ఈ సిరీస్‌లో కొన్ని సీన్లు చూసి నాపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కొన్ని కథలు అలాంటి సీన్స్‌ను డిమాండ్‌ చేస్తాయి. నేను ఒక యాక్టర్‌గా అలాంటి సన్నివేశాలను కథలో భాగంగా చేస్తాను. అందులో చూపించిన సీన్‌ పెళ్లి తర్వాత ఇష్టం లేకుండా జరిగే శృంగారం వంటిది.

ఇది చాలామందిని బాధపెడుతోంది. చాలామంది మహిళలు దీనివల్ల సమాజంలో బాధపడుతున్నారు. కాగా ఆ సీన్‌ అతి దారుణమైన రేప్‌ని సూచిస్తుంది కానీ, అలాంటి దానిని కొన్ని విరీడియా వర్గాలు సెక్స్‌ సీన్లుగా వర్ణించడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. అసలు విరీకు అక్కా%“%చెల్లెళ్లు, కూతుళ్లు లేరా.. వాళ్లకు ఇలా జరిగితే అలాగే మాట్లాడతారా అంటూ ప్రశ్నించింది. వారికి మాత్రం ఇలాంటివి జరగకూడదని ప్రార్ధిస్తున్నట్లు తెలిపింది. ఒక యాక్టర్‌గా నేను నటించాను, ఆ సన్నివేశాలేవి నాకు ఇబ్బంది కలిగించలేదు.

నేను ఒక నటిగా ఏ పాత్ర అయిన సరే ఆడియన్స్‌కి బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.