వామ్మో.. రాజమౌళిని అడ్డంగా బుక్ చేసిన సుమ.. సుమ అడిగిన ప్రశ్నకు చిక్కల్లో పడ్డ దర్శకుడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వలేదు అంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటాయో అంచనా వేయవచ్చు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ స్థాయిలో వసూలు చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ సీతారామరాజు పాత్రలో నటించాడు. ఈ సినిమాలో వీరిద్దరూ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. చాలామంది ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మొట్టమొదటిసారిగా రాజమౌళి ఈటీవీలో ప్రసారం అవుతున్న క్యాష్ షోలో సందడి చేశారు. రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్ క్యాష్ షోలో సందడి చేశారు.

ఈ షోలో సుమతో పాటు ఆలియా భట్, రణబీర్ కపూర్ కూడా కూడా చాలా సందడి చేశారు. ఈవారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. అయితే ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరు బాగా నటించారు అనే ప్రశ్న ఎక్కువగా ఎదురయింది. రాజమౌళి మాత్రం దాటేస్తూ సమాధానం చెప్పకుండా తప్పించుకునే వాడు. అయితే ఇటీవల క్యాష్ షోలో పాల్గొన్న రాజమౌళికి సుమ మళ్లీ అదే ప్రశ్న వేసింది. క్యాష్ షోలో ఒక రౌండ్ లో రాజమౌళిని ప్రశ్నిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎవరి నటన మీకు నచ్చింది? అని ప్రశ్న వేసి రాజమౌళి బాగా ఇరికించింది. అయితే ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పకుండానే ప్రోమో ఎండ్ అయింది. సుమ అడిగిన ప్రశ్నకు రాజమౌళి చెప్పిన సమాధానం తెలుసుకోవాలంటే ఈవారం ప్రసారమయ్యే క్యాష్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.