Meghana Sarja: కన్నడ హీరో చిరంజీవి సర్జా గురించి అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సందర్భంలో ఆయన 35 ఏళ్ల వయసులోనే మరణించారు. మరొక బాధకరమైన విషయమేమిటంటే చిరంజీవి సర్జా భార్య వయసు కేవలం 30ఏళ్లు మాత్రమే. అంతే కాకుండా ఆయన చనిపోయటప్పటికీ ఆమె గర్భంతో ఉంది. అండగా ఉండాల్సిన సమయంలోనే ఈ ఘటన జరగడం ఆమె తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోధించారు.
ఇక ఆమెకు వచ్చిన కష్టం చూసి మామూలు ప్రజానీకం సైతం కంటతడి పెట్టారు. చిరంజీవి సర్జా జూన్ 7, 2020 న మరణించారు. కాగా ఇతను మరణించిన సంవత్సర కాలంలోనే మరొక కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మరణించే సమయానికి ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నట్టు సమాచారం. ఇక ఆయన అకస్మాత్తుగా గుండె పోటుతో చనిపోవడంతో కన్నడ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురైంది. అంతే కాకుండా అతని మరణాన్ని జీర్ణించుకోలేక చాలా మంది ఫ్యాన్స్ చాలా శోకించారు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు చిరంజీవి మరణవార్తను తట్టుకోలేకపోతున్నారు . ఇక అతను చనిపోయిన 4 నెలల తర్వాత అతని భార్య మేఘనకు అబ్బాయి పుట్టాడు. అప్పటినుంచీ ఆ బాబును జూనియర్ చిరంజీవి అని పిలవడం ఆరంభించారు. కానీ ఇటీవలే మేఘన ఆ బాలుని పేరును రాయన్ సర్జాగా నామకరణం చేసి ఇదే విషయాన్ని అధికారంగా ప్రకటించారు.
ఇక తన భర్త చనిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటూ కొడుకులోనే తన భర్త చిరంజీవిని చూసుకుంటున్నట్టు సమాచారం. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆమె కెరీర్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. కెరీర్‌లో లీనమై వరుసగా సినిమాలు చేస్తే తప్ప ఆ ఫీలింగ్ నుంచి బయటపడలేననే ఉద్దేశంతో బిజీగా మారిపోయింది మేఘన. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం 2 సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి సెల్ఫీ మమ్మీ – గూగుల్ డాడీ కాగా, మరొకటి ఉద్దిమంత. ఇక ఈమె నటించిన 2 సినిమాలూ త్వరలోనే విడుదల కానుండడం విశే షం. ఇదిలా ఉండగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వస్తోన్న వార్తలు నిజం కావంటూ సీరియస్ అయ్యారు మేఘనా రాజ్. అంతే కాకుండా కన్నడ బిగ్‌బాస్ విన్నర్‌తో కలిసి ఏడడగులు వేయబోతుందన్న ప్రచారాలు కూడా జరగినా అలాంటి వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని కొట్టిపారేసారు మేఘనా రాజ్.