ఓ ప్రముఖ నిర్మాత, ఓ యంగ్ హీరోతో సినిమాని ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ అంతా ఓకేనే.! కానీ, చివరి నిమిషంలో ఆ నిర్మాత వెనక్కి తగ్గారు. దర్శకుడూ ఒకింత నొచ్చుకున్నాడు.
అసలు విషయమేంటని ఆరా తీస్తే, ఆ హీరోనే అసలు సమస్య అట. ఈ విషయమై దర్శకుడూ, నిర్మాత వైపే నిలబడుతున్నాడట. ఇంతకీ, ఏం జరిగింది.? అంటే, ప్రాజెక్టు కోసం.. అంతా సిద్ధమైపోయింది.
కానీ, ఇంతలోనే ఆ హీరో తాను నటించిన ఓ ఫ్లాప్ సినిమా గురించి మాట్లాడుతూ, తప్పంతా నిర్మాతదేనని తేల్చేశాడు. ఈ విషయమై సినీ పరిశ్రమలో బోల్డంత చర్చ జరిగింది. తప్పు అనాలో.. తొందరపాటు అనాలో.. నిర్మాత అయితే రిస్క్ చేశాడు ఆ సమయంలో.
హీరో కూడా, ఆ రిస్కుని సమర్థించాడు. సినిమా విడుదలయ్యాక.. ఫలితం తేలిపోయింది. ఫెయిల్యూర్‌కి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. కానీ, నిర్మాతదే పాపం.. అని తేల్చేశాడా హీరో. ఇదే కొత్త కాదు అతనికి.
గతంలోనూ పలు సార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆ యంగ్ హీరో. అందుకే, రిస్క్ ఎందుకని, మొత్తానికే కొత్త ప్రాజెక్టుని నిర్మాత, వేరే హీరో వైపు మరల్చాడట. దర్శకుడూ నిర్మాతనే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరా హీరో.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.