రాజమౌళి సినిమాలో అలియా భట్ కనిపించేది అంతేనా.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.కాకపోతే ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా… రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది.

మొట్టమొదటిసారిగా రాజమౌళి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇకపోతే ఈమే మొదటి సారిగా తెలుగులో నటిస్తున్న చిత్రం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో అలియా భట్ నటించడానికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె ఈ సినిమాలో కేవలం 15 నిమిషాలు పాటు మాత్రమే తెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పది రోజుల పాటు ఈ సినిమాకు కాల్షీట్స్ అందించినట్లు సమాచారం.

ఇక పది రోజులు షూటింగ్ లో పాల్గొన్న అలియా భట్ ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈమె రోజుకు 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఇలా ఈమెకు తెలుగులో మొదటి సినిమాతోనే భారీ రెమ్యునరేషన్ అందుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.