ఆ కమెడియన్ నాకోసం ఓ గది కట్టించారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తేజ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తేజ గురించి అందరికీ సుపరిచితమే ఈయన సినిమాలు ఎంతో మూసదోరనిలో ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి.చిత్రం సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి తేజ అనంతరం ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇలా ఈయన దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఎంతోమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలలో కొనసాగుతున్నారు.

ఇకపోతే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కదా.. ఎవరైనా మీకోసం ఏదైనా చేశారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ నాకోసం ఎవరు ఏం చేయాలి అంటూ ఎదురు ప్రశ్నించడమే కాకుండా కమెడియన్ సునీల్ శెట్టి తనకోసం ఓ గదిని కట్టించారని తెలిపారు.సునీల్ శెట్టి జయం సినిమా ద్వారా తేజ డైరెక్షన్ లో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది.

ఓ రోజు సునీల్ శెట్టి తన వద్దకు వచ్చి తన కాళ్లపై పడి నేను ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాను ఇలా సొంత ఇంటిని నిర్మించుకున్నాను అంటే అది కేవలం మీరు ఇచ్చిన అవకాశం వల్లనే అంటూ కాళ్లపై పడ్డారు.నేను తనని లేపి నేను నీలాంటి వాళ్ళని ఎందరిలో ఇండస్ట్రీకి పరిచయం చేశాను అయితే ఏదో ఒక రోజున నేను వీధిన పడక తప్పదు. అలా వీధిన పడిన రోజు తప్పకుండా నేను నీ ఇంటికి వస్తాను నా కోసం ఒక గది కట్టించి పెట్టు అని చెప్పాను.అందుకు సునీల్ తన ఇంట్లో నా కోసం ఒక గదిని నిర్మించడమే కాకుండా ఆ గదిలో తన ఫోటోని పెట్టి తరచూ గదిని శుభ్రం చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా తేజ వెల్లడించారు.