థాంక్యూ ఢిల్లీ.. మళ్లీ కలుద్దాం రష్మిక పోస్ట్ వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పరిచయం అవసరం లేదు ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రష్మిక వరుస సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీ బిజీగా ఉన్నారు.ఇకపోతే అక్టోబర్ 7వ తేదీ హిందీలో ఈమె నటించిన గుడ్ బై సినిమా విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాజాగా ఈమె ఢిల్లీలో సందడి చేశారు.

ఇలా ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలలో రష్మిక చేసిన హంగామా మామూలుగా లేదు.పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మేము తిరిగి ముంబై చేరుకోవాల్సి ఉంది అయితే ఢిల్లీలో ఈమె బాహుబలి ఫుడ్ మెనూ ఆర్డర్ ఇచ్చి ఆ రుచులను చూసి తిరిగి ముంబై చేరుకున్నారు. ఇలా ముంబై చేరుకున్న సమయంలో ఈమె థాంక్యూ ఢిల్లీ మళ్లీ కలుద్దాం.. ఈసారి అంతకుమించి అనే విధంగా పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె సినిమాల విషయానికొస్తే త్వరలోనే పుష్ప 2సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే గుడ్ బై సినిమా విడుదలైన అనంతరం ఈమె ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా మాత్రమే కాకుండా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీటితోపాటు బాలీవుడ్ లో మరో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.