Actor Vijay: కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్’. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేశాయి. కాగా ఈ సినిమా కోసం దళపతి ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగే ఉంది. టాలీవుడ్‌లోనూ ఆయన నటించిన చిత్రాలు డబ్ అయి, సూపర్ హిట్ అయ్యాయి. ఇక కరోనా కాలంలో వచ్చిన మాస్టర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బీస్ట్ సినిమా విడుదల తేదీని ప్రకటించడంలో ఆయన అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు.
అంతా బాగుంది అనుకునే సమయంలో ఈ యంగ్ హీరో సినిమాకు కొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఇస్లాంవాదులను తీవ్రవాదులుగా చిత్రీకరించారంటూ తమిళనాడు ముస్లి లీగ్ అధ్యక్షుడు ముస్తఫా బీస్ట్ సినిమాను నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పలుచోట్ల ఈ సినిమాను విడుదల కానివ్వమంటూ వార్నింగ్‌లు కూడా ఇవ్వడం ఆ సినిమా మేకర్స్‌కు తలనొప్పిగా మారింది. ఓ మాల్‌ని టెర్రరిస్ట్‌లు హైజాక్ చేయగా, వారి నుంచి ప్రజలను రక్షించే సన్నివేశాన్ని కథాంశంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. అయిదే ఇందులో ఇస్లామిక్ టెర్రరిజాన్ని చూపించబోతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. దీంతో ఈ సినిమా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతటితో ఆగకుండా మరికొంతమంది ఈ సినిమాకు వ్యతిరేకంగా మీమ్స్, పోస్టింగ్‌లు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఇప్పటివరకూ సైలెంట్ ఉన్న దళపతి, తాజాగా ఫైర్ అయ్యారు. హద్దులు మీరొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా సినీ ప్రముఖులు, మత సంబంధ సంఘాలపై ట్రోల్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అంతగా ప్రమోషన్స్ ఏమీ చేయకపోయినా, కచ్చితంగా మూవీ హిట్ అవుతుందన్న కాన్ఫిడెంట్‌తో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది.