Ram pothineni: రామ్ సినిమాలో మరో సారి సింగర్ గా మారనున్న కోలీవుడ్ స్టార్..!

Ram pothineni: రెడ్ సినిమా అనంతరం చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ది వారియర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. తమిళ దర్ఖకుడు లింగుస్వామి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో తొలి సినిమాతోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంత చేసుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రామ్ లుక్ విడుదల కావడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి మరొక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే పలు చిత్రాల్లో పాటలు పాడి మంచి పేరు తెచ్చుకున్న స్టార్ హీరో శింబు ఇప్పుడు రామ్ నటించబోయే సినిమాతో మరో సారి సింగర్ గా మారబోతున్నాడు. అందులో భాగంగా శింబు ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ పాడబోతున్నట్టు సమాచారం. అప్పట్లో తెలుగులో బుజ్జిపిల్ల అనే సాంగ్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

తొలిసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అంతే కాకుండా ఆది పినిశెట్టి కూడా ఈ మూవీలో ఓ ప్రధాన పాత్రలో కనపించబోతున్నట్టు తెలుస్తోంది.