రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో?

రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ దీని ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా ఉంటారని వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా ఒక ప్రముఖ తమిళ్ హీరోని రాజమౌళి తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఆ విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే తెలుగు లో గుర్తింపు ఉన్న తమిళ హీరో కార్తీని తన సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ గా చూపించబోతున్నట్లు రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడు అని త్వరలోనే అతన్ని కలిసి కథ కూడా చెప్పబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే రాజమౌళి ఇంకా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేయలేదు అప్పుడే విలన్ కోసం వెళ్ళాడు అంటే నమ్మడానికి కాస్త డౌట్ గానే ఉంది.