ఉత్తరాది బాక్సాఫీస్‌పై తెలుగు చిత్రాల దండయాత్ర!

చిన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్‌’ చిత్రం జాతీయ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తోంది. పాన్‌ ఇండియా ఇమేజ్‌ ఉన్న టాప్‌ హీరోల స్థాయిలో రేర్‌ రికార్డ్‌ను సెట్‌ చేసింది ఈ సినిమా . దీంతో గతంలో ఇలాంటి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్‌. సంక్రాంతి బరిలో బిగ్‌ కాంపిటీషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్‌’ మాకు లాంగ్‌ రన్‌ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ముందు నుంచే చెప్పారు.

ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ అన్‌ బిలీవబుల్‌ రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తోంది ఈ ఫాంటసీ డ్రామా.పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అయిన హనుమాన్‌ 30 రోజుల్లో 300 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. కేవలం హిందీలోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నార్త్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయితే మన సినిమాలకు ఏ రేంజ్‌ వసూళ్లు వస్తాయో మరోసారి ప్రూవ్‌ చేసింది ‘హనుమాన్‌’.

‘బాహబలి-2’తో తెలుగు నార్త్‌లో సంచలనాలు నమోదు చేయటం మొదలైంది. ‘బాహుబలి-2′ బాలీవుడ్‌లో 50 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. ఆ తరువాత సాహో, సలార్‌, ఆదిపురుష్‌ లాంటి సినిమాలతో ప్రభాస్‌, నార్త్‌ బాక్సాఫీస్‌లోనూ బాద్‌షాగా అవతరించారు.’ ట్రిపులార్‌’ తో మరోసారి ‘బాహుబలి 2’ మ్యాజిక్‌ను రిపీట్‌ చేశారు రాజమౌళి. పుష్పరాజ్‌గా నార్త్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌ కూడా సోలోగా రికార్డ్‌ వసూళ్లతో సత్తా చాటారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పుష్ప-2’తో అంతకు మించి బిగ్‌ నెంబర్స్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.