సురేఖా వాణి.. తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్. చాలా సినిమాల్లో నటించింది. చాలామంది హీరోలకు అక్కగా, అమ్మగా, ఇతర క్యారెక్టర్లలో అలరించింది. ఆమెకు పాపులారిటీ కూడా ఎక్కువే. ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును టాలీవుడ్ లో తెచ్చుకుంది సురేఖ.
ప్రస్తుతం కరోనా సమయం కదా.. సినిమాల షూటింగ్ లు గట్రా ఏవీ లేకపోయే సరికి.. సురేఖ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన కూతురు సుప్రితతో కలిసి చిందులు వేస్తోంది. డ్యాన్సులు వేస్తోంది. వాళ్ల డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వాళ్లకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో బాగానే వీడియోలు పెడుతున్నారు.
అయితే.. సురేఖకు సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ ను చూసి ఆమెను బిగ్ బాస్ 4 లోకి తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్నదట. అంతేకాదు.. ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే.. సురేఖ వాణి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తోందా? లేదా? అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పడం కష్టం.
ఈ విషయంపై సురేఖ వాణి కూతురు సుప్రితను లైవ్ లో నెటిజన్లు అడిగినా కూడా సమాధానాన్న దాటవేసింది సుప్రిత. సమాధానాన్ని సుప్రిత దాటవేసిందంటే ఖచ్చితంగా సురేఖ వాణి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినట్టే అని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.
మరోవైపు సురేఖను మాత్రమే కాకుండా… తన కూతురు సుప్రితను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని… వీళ్లిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే.. ఫన్ అన్ లిమిటెడ్ అని తమ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డియర్ బిగ్ బాస్.. తల్లిని మాత్రమే బిగ్ బాస్ లో తీసుకొని కూతురును వదిలేస్తే ఎలా? ఇద్దరినీ షోకి తీసుకోండి. ఆడియెన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఫుల్లు దొరుకుతుంది.. అంటూ బిగ్ బాస్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం.. మరి బిగ్ బాస్ యాజమాన్యం సోషల్ మీడియా పోస్టులు చూసి ఇద్దరినీ హౌస్ లోకి తీసుకుంటారో? లేదో?