‎Supritha: తల్లితో కలసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సుప్రీత.. నెట్టింట ఫోటోస్ వైరల్!

Supritha: టాలీవుడ్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో చాలా సినిమాలలో నటించి నటిగా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. ముఖ్యంగా సురేఖ అలాగే బ్రహ్మానందం కామెడీ సీన్స్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు పిన్నిగా అక్కగా తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువగా ఉంటుంది.

‎ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి కూడా మనందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఒక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే మరొకవైపు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. కాగా సురేఖ వాణి, సుప్రీత ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుప్రీత తల్లికి మించి అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఎక్కడికి వెళ్లినా కూడా తల్లి కూతురు ఇద్దరు కలిసి వెళ్లడం మనం ఫోటోలలో చూస్తూనే ఉంటాం.

‎ ఇద్దరూ తల్లి కూతుర్ల లాగా కాకుండా అక్క చెల్లెలు గా ఉంటారు. ఇది ఇలా ఉంటే సుప్రీత, సురేఖ వాణి కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో సుప్రీత తన తల్లి సురేఖ వాణి తో కలిసి పరమేశ్వరుడికి వ్యతిరేకంగా పూజలు అభిషేకాలు చేసింది. పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని తల్లితో కలిసి పూజలో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.