Amardeep–Supritha: అమర్ దీప్,సుప్రీత మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. వైరల్ అవుతున్న టైటిల్!

Amardeep–Supritha: తెలుగు బుల్లితెర నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బులితెరపై పలు షోలు, అలాగే సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు అమర్ దీప్. అయితే మొన్నటి వరకు బుల్లితెరపై అలరించిన అమర్ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీతతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సుప్రీత కూడా ఇప్పటికే పలు షాట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సోషల్ మీడియా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. అయితే ఇప్పుడు అమర్ దీప్ చౌదరి,సుప్రీత కలిసి హీరో హీరోయిన్స్ గా సినిమా చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ ని ప్రకటించారు.

CHOWDARY GARI ABBAYI THO NAIDU GARI AMMAYI Movie Title Glimpse | Amardeep Chowdary | Supritha Naidu

దీంతో ఈ టైటిల్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాని ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహా మూవీస్ తో కలిసి మహేంద్రనాథ్ కొండ్ల నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రియల్ లైఫ్ లో కూడా టైటిల్ కి తగ్గట్టు అమర్ దీప్, సుప్రీత ఇద్దరి క్యాస్ట్ లు అవే కావడంతో టైటిల్ ఇది మరింత వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమాలో రోహిత్, రాజా రవీంద్ర, రాసి, వినోద్ కుమార్, ఎస్తర్, రూప లక్ష్మి, గీత సింగ్, మెహబూబ్ బాషా, జబర్దస్త్ సత్యశ్రీ, టేస్టీ తేజ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.