సీఎం జగన్ తో జైలులో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పిన కౌశిక్!

జైలు శిక్ష అనేది సాధారణంగా స్వేచ్ఛలేని, సాధారణ విలాసాలు లేని జీవితాన్ని సూచిస్తుంది. జైలు నిబంధనలకు అనుగుణంగా సవాలుగా ఉండటమే కాకుండా ఖైదీ జీవితం నిరంతరం నిఘాలో ఉండేలా చూస్తుంది. అయితే, మీరు భారతదేశంలో విఐపి ఖైదీ అయితే మీరు జైలులో ఉండడం అంత కఠినంగా ఉండకపోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఖైదీలుగా పనిచేసిన కొంతమంది శక్తివంతమైన ఖైదీలకు ప్రత్యేక రెస్పెక్ట్ అందించిన వివాదాలను పరిశీలించడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది.

బుల్లితెర నటుడు అయిన కౌశిక్‌కు మంచి పేరుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 10 సినిమాలతో పాటు ‘ఆరుగురు పతివ్రతలు’, ‘శీను వాసంతి లక్ష్మి’ వంటి సినిమాల్లో అతను నటించాడు. మా ఇటీవలి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ 18వ ఈసీ సభ్యునిగా ప్యానెల్ నుండి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆయన తన ప్యానెల్ సభ్యులతో కలిసి రాజీనామా చేశారు. బ్యాలెట్ బాక్సులను తెరవకుండానే ఎన్నికల ఫలితాలు ప్రకటించడంపై ఆయన పలు మీడియా ఛానళ్లపై ఆగ్రహంను కూడా వ్యక్తం చేశారు.

కాగా గతంలో కౌశిక్ టీవీ ఆర్టిస్టుల సమస్యలపై పోరాడి జైలుకు కూడా వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జైలు అనుభవాలను పంచుకున్నాడు. ఆయన చంచల్‌గూడ జైలులో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేననీ దానివల్ల అతను అమెరికా వెళ్లే అవకాశం మిస్సయింది అని చెప్పుకుంటు వచ్చారు. ఒంటిపై రేకులతో సహా ఏదైనా తాళ్లు ఉంటే తెగిపోయేవి అంటూ చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

బట్టలు లేకుండా చీకటి గదిలో నిలబడి అంతా తనిఖీ చేశారట. వాళ్ళని చూడగానే అతను మూగబోయినట్టు తెలిపాడు. ఐతే కానిస్టేబుల్ తన మొహం గమనించి డ్రాయర్ వేసుకో అనీ చెప్పినట్టు తెలిపారు. దాంతో ఊపిరి పీల్చుకున్నానీ అందరికీ తెలియజేశారు.

అయితే ముఖ్యంగా అతను జైలులో ఉన్నప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ జైలులోనే ఉన్నట్టు చెప్పాడు కౌశిక్. అయితే అతను జగన్ ను ఎప్పుడూ కలవలేదనీ జగన్ వీఐపీ బ్యారక్‌లో ఉంటాడని మరి అతను జనరల్ బ్యారక్స్‌లో ఉంటాడని తెలిపాడు.

వీళ్ళిద్దరూ విడివిడిగా వేరేవేరే బ్యారక్ లలో ఉండటం వలన కలవడానికి సాధ్యం పడలేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి జగన్ వీఐపీ బ్యారక్‌లో ఉండటం వలన ఆయనకు వేరే ట్రీట్మెంట్ అతనికి వేరేగా ఉండేదని తన అనుభవాన్ని నెమరు వేసుకుంటూ అందరితో పంచుకున్నాడు.