జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. ఇలా ఎప్పుడూ జరగలేదంటూ స్టేట్మెంట్!

సంధ్య థియేటర్లో జరిగిన తోకేసలాట కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. అసలు మభ్యంతర బెయిల్ రావడంతో రాత్రే విడుదల అవుతారు అనుకున్నారు కానీ విడుదల ఆలస్యం కావడంతో శనివారం ఉదయం ఏడు గంటలకి విడుదల అయ్యారు. అతను జైలు నుంచి బయటికి రావటాన్ని పోలీసులు రహస్యంగా ఉంచడం గమనార్హం. అయితే జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ తన న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు, అనంతరం అల్లు అర్జున్ అక్కడ నుంచి తన ఇంటికి చేరుకున్నారు. అతని కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు అతను రావడంతో భావోద్వేగానికి లోనయ్యారు తర్వాత కుటుంబ సభ్యులు అతనికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం అభిమానులకి అభివాదం చేసిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ నేను బాగానే ఉన్నాను.

ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, నేను చట్టాన్ని గౌరవిస్తాను నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను న్యాయస్థానాన్ని గౌరవిస్తూ కేసు గురించి ఇప్పుడు ఏమి మాట్లాడలేను. సంధ్య థియేటర్లో మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. అలాంటి ఒక సంఘటన జరగటం దురదృష్టకరం. నేను 20 సంవత్సరాలుగా సినిమా హాల్లో సినిమాలు చూస్తున్నాను.

నా సినిమాలే కాదు మావయ్య సినిమాలు కూడా అలా చూశానని కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని, జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పుకొచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అల్లు అర్జున్ వారికి అండగా ఉంటామని మరొకసారి హామీ ఇచ్చారు. నిజానికి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు అతనికి మభ్యంతరం ఇచ్చింది. మద్యంతర బెయిల్ వచ్చినా ప్రక్రియ ఆలస్యకావటంతో రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం విడుదల అయ్యారు.