నటుడు ఎస్ వి శేఖర్ కి నెల రోజులు జైలు శిక్ష.. అప్పీల్ పిటిషన్ సైతం రద్దు!

ప్రముఖ తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఎస్‌.వి.శేఖర్‌కు మహిళా జర్నలిస్టును ఉద్దేశించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు ఆయనకు నెల రోజుల జైలుశిక్ష,15 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. సామాన్యులైనా.. ? సెలబ్రిటీలైనా…? ఎవరికైనా శిక్ష తప్పదు అని మరోసారి రుజువయింది ఇంతకీ అసలు సంగతేంటంటే..? 2018లో ఎస్‌.వి.శేఖర్‌ సోషల్ మీడియాలో తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానిస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు.

అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.ఆ పోస్టు వివాదాస్పదమయ్యింది. ఆ పోస్ట్ మహిళా జర్నలిస్టు లను బాధించాయి. ఆయన అన్న మాటలు రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేశాయి. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో తేలింది. ఈ విషయంలో చాలా మంది కోర్టుకెక్కారు. వివాదం పెద్దది అవుతుండగా.. ఎస్‌.వి.శేఖర్‌ వెంటనే సారీ కూడా చెప్పారు.

అయినా ఏమాత్రం తగ్గని ప్రతి ఎద్దులు కేసుని వెనక్కి తీసుకోలేదు దాంతో ఎన్నాళ్ళు ఈ కేసు కొనసాగుతూ వచ్చింది ఈ కేసు నుంచి బయటపడటం కోసం శేఖర్ చాలా ప్రయత్నాలు చేశారు, హైకోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. విచారణని ఎదుర్కోవాల్సిందే అని ఆదేశించింది. ఈ కేసు చెన్నై కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ విచారించారు. నెల రోజులు జైలు శిక్ష 15 వేల జరిమానా శిక్ష విధిస్తూ గత ఏడాది తీర్పు ఇచ్చారు జస్టిస్ జయవేల్.

అయితే శేఖర్ తరపు న్యాయవాదులు అప్పీల్ కి అవకాశం కల్పించాలని కోరడంతో వారికి తగిన సమయం ఇచ్చారు కోర్టు వారు. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణ ముగిసింది. అప్పీల్ పిటిషన్ ని రిజెక్ట్ చేసి శేఖర్కి నెల రోజులు జైలు శిక్ష విధించారు జస్టిస్ వేల్ మురుగన్. 100కు పైగా చిత్రాల్లో నటించిన నటుడు శేఖర్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. 2006లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.