లైవ్‌లోడ్యాన్స్ ప్రాక్టీస్.. తేజస్వీ అలా దర్శనమివ్వడంతో అందరూ ఫిదా!!

Tejaswi Madivada Live Dance Class Sessions In Instagram

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. రెండో సీజన్‌లో ఇంటి సభ్యులందరికీ డ్యాన్స్ మాస్టర్‌గానూ వ్యవహరించింది. సామ్రాట్, దీప్తి సునయలను ఓ టాస్క్ ఇస్తే అందులో మంచి రొమాంటిక్, ఊపున్న సాంగ్‌కు తేజస్వీయే కొరియోగ్రఫీ చేసింది. సినిమాల్లోనూ తేజస్వీ తన డ్యాన్సులు ఊపేసింది. డ్యాన్సుల్లో తేజస్వీకి ఎవ్వరూ వంక పెట్టలేరు. అయితే ఈ లాక్ డౌన్‌లో తేజస్వీ ఓ షెడ్యూల్ ఫిక్స్ చేసింది.

Tejaswi Madivada Live Dance Class Sessions In Instagram
Tejaswi Madivada Live Dance Class Sessions In Instagram

ప్రతీ రోజూ సాయంత్రం ఓ గంట పాటు లైవ్‌లోకి వస్తానని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానని తేజస్వీ చెప్పుకొచ్చింది. ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటే అందులో చూసి నేర్చుకోవచ్చని తెలిపింది. ఇలా ఫ్రీగా డ్యాన్స్ క్లాసుల్లాంటివి పెడుతూ వస్తోంది. ఇలా లైవ్‌లో తేజస్వీ రచ్చ రచ్చ చేస్తోంది. ఆమె డ్యాన్స్ మాస్టర్‌తో పాటు లైవ్‌లో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా తేజస్వీ లైవ్‌లోకి వచ్చింది.

అయితే నిన్నటి లైవ్ సెషన్‌లో తేజస్వీని చూసి అందరూ ఫిదా అయ్యారు. డ్యాన్స్ చేయడంలో కంఫర్ట్‌గా ఉండాలని అలాంటి డ్రెస్ వేసుకుందో ఏమో గానీ, ప్యాంట్ మాత్రం వేసుకోలేదు. కేవలం టీ షర్ట్ మాత్రం ధరించి డ్యాన్సులను ఇరగొట్టేసింది. మామూలుగా అయితే తేజస్వికి ఇవన్నీ లైట్. బీచ్‌లు, బికినీలు అంటేనే తేజస్వీకి ఇష్టం. రోజు హాట్ హాట్ ఫోటో షూట్లు, బికినీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కిక్కిస్తూ ఉంటుంది.