ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ వల్ల తేజస్వికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అందుకే బిగ్ బాస్ తరువాత ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. వచ్చినా ఓ షో కూడా డిజాస్టర్ అయింది. బ్రహ్మానందం హోస్ట్‌గా వచ్చిన లాఫ్టర్ చాలెంజ్ అనే స్టాండప్ కామెడీ షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ షోకు తేజస్వీ యాంకర్‌గా ఉంది. కానీ ఆ షోలో అంతగా కలిసి రాలేదు.

Tejaswi Madivada latest pic goes viral
Tejaswi Madivada latest pic goes viral

అలా బిగ్ బాస్ వల్ల తేజస్వీకి లాభమేమీ కలగలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆ ఫాలోయింగ్‌ను తేజస్వీ తన అందాల ఆరబోతతో పెంచుకుంటూ పోతోంది. తేజస్వీ చేసే హాట్ ఫోటో షూట్‌లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. తేజస్వీ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసే ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. లాక్డౌన్‌లో తేజస్వీ డ్యాన్స్ క్లాసులకు సంబంధించి లైవ్ సెషన్ పెడుతూ ఎంతో మందిని ప్రోత్సహించింది.

తేజస్వీలో ఎవ్వరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. తేజస్వీలో ఓ ఆర్టిస్ట్ దాగి ఉన్నాడు. తన డ్రాయింగ్ ప్రతిభను చూపిస్తూ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తేజస్వీ వేసిన గీసిన బొమ్మలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే వీటన్నంటికంటే తేజస్వీ అందాల ఆరబోత మరింత రచ్చ చేస్తోంది. ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి అమ్మడు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి ఏది చేసినా కూడా తేజస్వీ తన మార్క్ కనిపించేలా చేస్తుంది.