సెలెబ్రిటీలకు నిత్యం ఫోటో షూట్లు చేయించుకోవడం అలవాటే. మ్యాగజైన్ కోసం లేదంటూ ఏదైనా యాడ్ కోసం లేదా మరేదైనా ప్రమోషనల్ కార్యక్రమం కోసమో ఫోటో షూట్లు చేస్తుంటారు. అయితే ఈ మధ్య కొన్ని ఫోటో షూట్ల జనాలను బక్రాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రెస్ ధరిస్తారు.. కానీ ఫోటో షూట్లో మాత్రం నగ్నంగా ఉన్నట్టు పోజులిస్తారు. దానికి తగ్గట్టే కెమెరామెన్ కూడా యాంగిల్స్ సెట్ చేస్తాడు. ఆ మధ్య డబూ రత్నాని అనే ఇండియన్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ తన క్యాలెండర్ కోసం తీసిన ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
కియారా అద్వాణి అందాల ఆకులను అడ్డుపెట్టి ఫోటో షూట్ చేయగా అది నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. అయితే కొద్ది సేపట్లోనే అది మోసం అని తేలిపోయింది. కియారా డ్రెస్ వేసుకుని ఉన్నా కూడా తన కెమెరా యాంగిల్స్‌తో నగ్నంగా ఉందేమోనన్న భ్రమ కలిగించారు. ఇలాగే ఆ మధ్య రకుల్ ప్రీత్ కూడా వెజిటేరియన్ గురించి చెబుతూ పెటా అనే సంస్థకు ఫోటో షూట్ చేసింది. అందులో కూడా ఆమె నగ్నంగా ఉన్నట్టు భ్రమించేలా చేశారు.
ఆ తరువాత అసలు విషయం తెలిసింది. అది నగ్నంగా ఉందని భ్రమించేలా చేశారు. కానీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశాక అసలు సంగతి భయపపడింది.తాజాగా బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ కూడా ఇలాంటి ఓ ఫోటో షూట్‌తో బక్రాలను చేసేందుకు రెడీ అయింది. నగ్నంగా ఉన్నట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఆమె అసలు సంగతి బయటపడింది. చేతులు అడ్డుపెట్టుకుని కారులో కూర్చుని కెమెరా యాంగిల్‌ను అలా పెట్టడంతోనే నగ్నంగా ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. ఇలా బక్రాలను చేద్దామని చూసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ ట్రిక్స్ చూసి చూసి జనాలు కూడా హుషారయ్యారు.