బిగ్ బాస్ బ్యూటీ కనిపించడానికే బోల్డ్ కాదు.. నిజ జీవితంలోనూ ఎంతో బోల్డ్ అన్న సంగతి బయటకు వస్తోంది. కమిట్‌మెంట్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు చిత్రసీమ, ఇక్కడ తెలుగమ్మాయిలను చూసే విధానంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తెలుగు అమ్మాయిలను నేరుగా అడిగేస్తారని, కమిట్‌మెంట్ ఇవ్వకపోతే ఛాన్సులు ఇవ్వరని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. తాజాగా అంతకుమించిన బోల్డ్ కామెంట్స్ చేసింది.
తన కెరీర్లో తొలిసారిగా కమిట్‌మెంట్ సినిమా కోసమే లిప్‌లాక్ సీన్లలో నటించానని చెప్పింది. గతంలో నటించిన ముద్దు సన్నివేశాలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకుందట. అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పింది. మళ్లీ అవకాశాలు రావడంతో పెళ్లి సంగతి పక్కన పెట్టేశానని, అసలిక జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
పెళ్లి చేసుకోకపోయినా బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే తప్పులేదని వెరైటీగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తానొక వ్యక్తిలో రిలేషన్లో ఉన్నానని అసలు సంగతి బయట పెట్టింది. గతంలో తాను ఇద్దరితో డేటింగ్ చేశానని, పదేళ్ల పాటు వ్యవహారం నడిచిందని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది.